सुरवाणी-कथावनी-7. मनसः नियन्त्रणं कुतः!
मनका नियंत्रण कहाँ?
Where is the control of mind?
మనసు యొక్క అదుపు ఎక్కడ!
१. रविः आकाशे स्वकर्म कर्तुं सिद्धतां कुर्वन् आसीत्।
सूरज आकाश में
अपना कार्य करने के लिए तैयारी कर रहा था।
The sun was making
preparations for his work.
సూర్యుడు ఆకాశంలో తన పని చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు.
२. अरुणः तत्पूर्वम् उत्थाय रथं सज्जीकरोति स्म।
अरुण उससे पूर्व ही उठकर रथ को तैयार कर रहा था।
Aruna had woke up before that and was preparing the chariot.
అరుణుడు దానికి ముందు లేచి రథాన్ని సిద్ధం చేస్తున్నాడు.
३. हेमन्तकालः सः। सर्वत्र प्रातः तुषारवृष्टिः दृश्यते स्म ।
वह हेमन्तकाल था। प्रातःकाल सभी स्थान
पर हिमपात
(होते) दिखरहा
था ।
It was the autumn season. There was snowfall seen
everywhere.
హేమంతకాలం అది. అంతటా ఉదయం మంచువాన కనుపిస్తూ ఉండింది.
४. तत्र एकः सम्प्रदायानुसारी धनिककुटुम्बः आसीत् ।
There was a rich family who were traditional.
అక్కడ ఒక సంప్రదాయికమైన ధనిక కుటుంబం ఉండేది.
तत्रैका सुन्दरी तरुणी।
There lived a beautiful young woman.
అక్కడ ఒక సుందర యువతి.
सा तत्र प्रत्यहं करणीयेषु कार्येषु निमग्ना
आसीत्।
She used to be immersed in her everyday duties.
ఆమె అక్కడ ప్రతిరోజూ చెయ్యవలసిన పనులలో నిమగ్నమై ఉండింది.
गृहात् बहिः एका वाणी श्रुता तया, “भवति, भिक्षां देहि” इति।
A voice was heard by her, “O woman, please give me bhikṣā.”
ఇంటి ముందు (నుండి)ఒక స్వరం వినబడింది ఆమె చేత- 'భవతి భిక్షాం దేహి' అని.
'आतपागमनात् पूर्वमेव क एष आगतः भिक्षार्थम्'
इति विचार्य सेवकाः तया आदिष्टाः 'याचकाय
धान्यादिकं दीयताम्' इति ।
Thinking, ‘Who has come here even
before the heat’, the servants were ordered by her, ‘let grains etc. be given
to the beggar’.
‘ఎండ రాకముందే ఎవరు ఇతడు వచ్చాడు భిక్ష కోసం?’ అని అనుకొని సేవకుడు ఆమె చేత ఆదేశింపబడ్డాడు, 'యాచకుడి కొరకు ధాన్యాదులను ఇవ్వు', అని.
ततः कौतुकात् वातायनेन स्वशिरः किञ्चिदुन्नमय्य
बहिः दृष्टिं प्रसारितवती, सा कीदृशः याचकः स्यादिति।
Then she held up her head a little, and cast her glances,
outside, what kind of beggar he must be.
దానితో కుతూహలం వల్ల కిటికీ నుండి తన తల కొంచెం పైకెత్తి బయటకు దృష్టిని సారించింది ఆమె ఎటువంటి యాచకుడు అయిఉండవచ్చు అని.
तत्र तया दृष्टः, कृशकायः,
चिरात् अस्नातः, परं नेत्राभ्यां केवलं
कान्तिम् उत्पादयन् इव ब्रह्मवर्चस्वी एकः योगी।
There, a very great yogi with brahmic glory was seen by her,
who was thin-bodied, who was unbathed for long, but showering great light
through his eyes.
ఒక బక్క చిక్కినవాడు, చాలాకాలం నుండి స్నానం చేయకుండా ఉన్నా కానీ నేత్రద్వయం నుండి కేవలం కాంతిని కలిగిస్తున్నట్లుగా బ్రహ్మ వర్చస్వి ఒక యోగి అక్కడ ఆమె చేత చూడబడ్డాడు.
तस्य तेजःपूर्णे लोचने सततं ईक्षन्ती सा तेन
आकर्षिता बभूव।
While looking at his bright eyes continuously, she was
attracted by him.
అతని తేజోవంతమైన కళ్ళను తదేకంగా చూస్తూ ఆమె అతని చేత ఆకర్షితురాలైంది.
'मम कर्तव्यं किं, परम् अहं किं कुर्वन्ती
अस्मि?' इत्यादि सर्वं विस्मृत्य दीपेन पतङ्ग इव तेन योगिना
मदनपीडिता सा तद्विषयं चिन्तयित्वा स्व मनोनिग्रहं दूरीकृतवती।
Having forgotten, ‘What is my duty, and what
am I doing?’, and getting love-struck by the yogi she lost all her
mind-control.
'నా యొక్క కర్తవ్యం ఏమిటి', 'అయినా నేను ఏం చేస్తున్నాను' మొదలైనవి మర్చిపోయి
దీపం చేత (దీపం) పురుగు లాగా ఆ యోగి చేత మన్మథ పీడితురాలై ఆమె ఆ విషయాన్ని ఆలోచిస్తూ తన మనోనిగ్రహాన్ని దూరం చేసుకున్నది.
परं तस्याः मनोभीष्टम् अजानन् सः योगी
भिक्षार्थम् अविलम्बेन अन्यं गृहं गतवान्।
But not knowing of her desire, the yogi, immediately went to
another house for alms.
తదుపరి ఆమె యొక్క మనసులో కోరికను తెలియక ఆ యోగి భిక్ష కోసం ఆలస్యం చేయకుండా వేరే ఇంటికి వెళ్ళాడు.
किंत्वत्र तस्याः चेतः तापसस्य रूपमेव चिन्तितम्
पूर्णं दिनम्।
But here her mind was thinking all day of the ascetic’s form.
కానీ అక్కడ ఆమె యొక్క మనసు తాపసి యొక్క రూపాన్నే తలుచుకున్నది పూర్తి రోజు.
प्रतिक्षणं तमेव चिन्तयन्ती सा सर्वाणि कार्याणि
विस्मृत्य कामेन उन्मत्ता बभूव।
Every moment, thinking of him alone, she forgot all the
works and became mad by carnal desire.
ప్రతిక్షణం అతనినే తలుచుకుంటూ ఆమె అన్ని పనులను మరచి కోరికతో పిచ్చిదైపోయింది.
स्वस्य कामनां तस्मै न्यवेदयितुम् उत्सुका सा
परेद्युः ‘सः कदा आगच्छेत् अहं कदा तं पश्येयम्’ इति प्रतिक्षणं तमेव प्रतीक्षन्ती
आसीत् ।
Very zealous to let him know about her desire, the next day,
she awaited him every moment, thinking, ‘when will he come, when will I see
him.’
తన యొక్క కోరికను అతనికి చెప్పటం కోసం ఉత్కంఠయై ఆమె మరుసటిరోజు ‘అతడు ఎప్పుడు వస్తాడా,నేను అతనిని ఎప్పుడు చూస్తానా’ అని ప్రతి క్షణం అతనినే (అతని కొరకే) నిరీక్షిస్తూ ఉన్నది.
अचिरादेव स्वस्य यौवनं निन्दन्ती सा ' किं कुर्वन्त्यस्मि? एतादृश कुटुम्बे जाताहं कथमेवं
चिन्तयामि, मम विवेकः कुत्र नष्टः' इत्यादि
विचार्य यदि सः आगच्छेत् तदा अहं तं न द्रक्ष्यामि’ इति पश्चात्तापेन चिन्तितवती
सा मुग्धा।
Very soon, the pretty girl thought cursing her youth, ‘What
am I doing? How am I even thinking in such way, being born in such a family?
Where is my discrimination gone?’
వెంటనే తన యౌవనాన్ని నిందించుకొంటూ ఆమె 'ఏం చేస్తూన్నాను? ఇటువంటి కుటుంబంలో పుట్టిన నేను ఎలా ఇలా ఆలోచిస్తున్నాను? నా వివేకం ఎక్కడికి పోయింది?’ మొదలైనవి ఆలోచించి, ‘అతను వస్తే అప్పుడు నేను అతనిని చూడబోను’ అని పశ్చాత్తాపంతో ఆలోచించింది ఆ ముగ్ధ.
‘कामं दूरे स्थापयामि, सेवकद्वारा
भिक्षां दास्यामि, कथङ्कारमपि न तं पश्यामि’ इति मनसि
प्रतिज्ञामपि कृतवती।
‘I shall put desire away, I shall send alms through servant.
Whatsoever, I shall not look at him.’ She promised herself in her mind.
కోరికను దూరంగా ఉంచుతాను, సేవకుడి ద్వారా భిక్షను పెడతాను, ఎలా అయినా సరే, అతనిని చూడను’ అని మనసులో శపథం కూడా చేసింది.
परेद्युः यथाक्रमं सः योगी भिक्षार्थम् आगतवान्।
Next day, the yogi came for alms as usual.
మరురోజు ఆ యోగి భిక్ష కోసం వచ్చాడు.
तस्याः तरुण्याः मनः भूयोऽपि
आकर्षितं तद्विषये।
The maiden’s heart was even more attracted to the same
object.
ఆ యొక్క యువతి యొక్క మనస్సు మళ్ళీ కూడా ఆకర్షితమైంది ఆ విషయంలో.
पूर्वं मनसि या प्रतिज्ञा कृता सा पूर्णं
विस्मृता ।
The promise done in her mind was completely forgotten.
పూర్వం మనసులో ఏ శపథం చేయబడిందో అది పూర్తిగా విస్మరించబడింది.
मनोनिग्रहः दूरे परित्यक्तः।
The control of mind was left off far behind.
మనో నిగ్రహం దూరంగా వదలి వేయబడింది.
‘कामातुराणां न भयं न लज्जा’ इति वाक्यं सत्यं कर्तुमिव योगिनः समीपमागत्य सा तस्य शोभने अक्षिणी
बहुधा वर्णितवती, तथा “अहं तव प्रणयिनी अस्मि, किम् आवां दम्पती भवाव?” इति पृष्टवती।
As if to make the statement ‘the desire-struck have neither
fear nor shame’ true, she approached the yogi, and described his splendid eyes in many ways, and asked, “I
am in love with you. Shall we both be wife and husband?”
కామాతురాణాం న భయం న లజ్జా అనే వాక్యాన్ని నిజం చేస్తున్నట్లుగా యోగి యొక్క సమీపానికి వచ్చి ఆమె అతని యొక్క అందమైన కన్నులను అనేక విధాలుగా వర్ణించింది, అలా “నేను నీ ప్రేయసిని అయి ఉన్నాను, ఏం మనమిద్దరం దంపతులం అవుదామా?” అని అడిగింది.
किन्तु सः तापसः तस्याः वचांसि शृण्वन्नपि उत्तरं अदत्वा 'सौभाग्यवती भव, शुभमस्तु' इति
आशीः दत्वा गतवान्।
But the mendicant, even having heard her
words, did not reply, and gave her blessings, ‘be the fortunate one, let there
be auspice’ and went away.
కానీ ఆ తాపసి ఆమె మాటలను వింటూ కూడా సమాధానం ఇవ్వకుండా, 'సౌభాగ్యవతీ భవ, శుభమస్తు' అని ఆశీస్సులను ఇచ్చి వెళ్ళాడు.
‘परेऽहनि स आगत्य मां वृणुयात्’ इति चेतसि
नानाविधकल्पनां कुर्वन्ती सा तं पुनः प्रतीक्षन्ती आसीत् ।
Imagining in many ways in her mind that, ‘The next day, he
shall come and choose me’, she awaited him again.
‘మరుసటిరోజు వచ్చి నన్ను వరిస్తాడు’ అని మనసులో నానా విధాల ఊహిస్తూ ఆమె అతనిని(కోసం) మళ్ళీ ఎదురుచూస్తూ ఉన్నది.
प्रातः सहचराभ्यां साकं तयोः बाहू अवलम्ब्य
कष्टेन भिक्षार्थम् आगतः सः तापसः ।
The following morning, that man of penance came along with
great difficulty, holding the arms of two followers.
ఉదయం ఇద్దరు సహచరులతో కూడి, వారి చేతులు ఆధారంగా కష్టంతో భిక్షకోసం వచ్చాడు ఆ తాపసి.
'किं किमभूत्' इति सहसा
पृच्छ्यन्त्याः भामिन्याः हस्ते स्वनेत्रपटलौ स्थापयित्वा एवमुक्तवान् योगी ।
To the maiden who was asking, ‘what happened,
what happened?’, the yogi put his two eye balls in her hands and replied thus.
'ఏమిటి ఏమైంది?' అని ఆ భామిని చేత అడుగబడుతూ, చేతులు రెండూ తన కన్ను రెప్పలపై పెట్టుకుని ఇలా అన్నాడు యోగి.
“अये अम्ब, एताभ्यां
लोचनाभ्यामेव आकर्षिता भवती, अतः त्वदर्थं लोचने दत्ते मया
स्वीकुरु' इत्युक्त्वा तस्याः अन्तःचक्षुः उद्घाट्य गतः सः।
“O mother, you were attracted by these very eyes. Hence, the
eyes are given to you, please have them.”, having said so, he opened her inner
eyes and went away.
'ఓ తల్లీ, ఈ కళ్ళతోటే ఆకర్షితురాలవైనావు నువ్వు, అందువల్ల నీ కోసం కళ్ళను ఇవ్వబడుతున్నవి నా చేత, తీసుకో', అని చెప్పి ఆమె యొక్క అంతర్నేత్రాలను తెరిచి వెళ్ళిపోయాడు అతడు.
एषा कस्यापि नरस्य दुःखकथा न, योगिश्रेष्ठः इति ख्यातस्य गोरखनाथमुनेः गुरोः अलक् निरञ्जनस्य त्यागकथा
एषा ।
This is not the story of any ordinary person, but it is the
real sacrificing story of the guru of muni gorakhnath, Alak Niranjan, who is
well-known as the best yogi.
ఈ దుఃఖ కథ ఎవరి యొక్కయూ మనిషి యొక్క కథ కాదు, ‘యోగిశ్రేష్ఠుడు’ అని ఖ్యాతి గల గోరఖనాథ ముని యొక్క గురువు అలక్ నిరంజనుడి యొక్క త్యాగ కథ ఇది.
प्रत्येकस्य मानवस्यापि मनोनिग्रहं सर्वथा
आवश्यकम्।
ప్రతి యొక్క మానవుని(కి) యొక్క మనో నిగ్రహం ఎప్పడూ అవసరం.
यदि मनसः नियन्त्रणं कर्तुं न शक्यते तदा जीवने
किं साधितुं शक्नुमः? बहु कष्टसाध्यं तत्।
అయితే మనసు(ను) యొక్క అదుపు చేసుకోలేకపోతే అప్పుడు జీవితంలో ఏమి సాధించగలము? చాలా కష్ట సాధ్యం అది.
शुकनासोपदेशे एकं वाक्यम्- 'यौवनं धनसम्पत्तिः प्रभुत्वम् अविवेकिता, एकैकमप्यनर्थाय
किमु यत्र चतुष्टयम् ' इति।
శుకనాసోపదేశంలో ఒక వాక్యం- 'యౌవనం ధనసంపత్తి ప్రభుత్వం అవివేకత, ఒక్కొక్కటీ కూడా అనర్థం కొరకే, ఇక నాలుగూ ఉంటే చెప్పేదేముంది.' అని.
यौवने, सति प्रभुत्वे,
सति बहुधने भोगबुद्धिः मा भवेत् ।
యౌవనంలో, అధికారంలో ఉండగా, ఎక్కువ ధనం ఉంటే భోగ బుద్ధి ఉండరాదు.
नो चेत् तदेव अनर्थं जनयेत्।
లేకుంటే అదే అనర్థాన్ని కలిగిస్తుంది.
तथा च 'असंशयं मनोनिग्रहम्
' इति
అలాగే 'మొక్కవోని మనోనిగ్రహం'అని.
कृष्णवाक्यानुसारेण बहु कष्टसाध्यमपि अवश्यं
मनोनिग्रहं करणीयम् ।
కృష్ణవాక్యానుసారం చాలా కష్టసాధ్యమైనా కూడా తప్పకుండా మనోనిగ్రహాన్ని సాధించాలి.
तदा जीवने किमपि महत् साधयामः ।
అప్పుడు జీవితంలో ఏదైనా గొప్పను సాధించగలము.
मूलम्- आचार्य श्रीशः
अनुवादकः - श्रीनिधि अभ्यङ्करः
उपकर्ता- आचार्य चिदम्बरः
संस्कृतम्- श्रीनिधिः अभयङ्करः
English - Usha Rani Sanka
తెలుగు సేత - పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి