सुरवाणी-कथावनी-5 ज्ञानादिना किं प्रयोजनम्

एकस्मिन् ग्रामे एकदा वृष्टेः अभावः अभवत् ।
Once there was an absence of rain in a village.
ఒకానొక గ్రామములో ఒకప్పుడు వర్షాభావం సంభవించింది.

जनाः सर्वे जलाभावेन चिन्तातुराः बभूवुः ।
All the people were worried because of the absence of water.
జనమంతా జలాభావం చేత చింతాతురులైనారు.

तत्र केचन वृद्धाः सर्वान् एकीकृत्य एवम् उक्तवन्तः-
There some old people assembled everyone and said thus-
అక్కడ కొందరు పెద్దలు అందరినీ సమావేశపరచి ఇలా చెప్పారు-
वयम् अस्माकं ग्रामदेवतायाः मूर्तेः शोभायात्रां कृत्वा पूजयामः तेन तुष्टा सा वृष्टिम् अनुगृह्णीयात्इति ।
“We shall do the procession of the idol of the deity of the village, and worship her. She will be pleased with that and grant rain.”
మనం మన గ్రామదేవత యొక్క విగ్రహాన్ని ఊరేగించి పూజిద్దాం, దానివల్ల వర్షాన్ని అనుగ్రహించవచ్చు”, అని.

सर्वैः एषः उपायः अङ्गीकृतः ।
This idea was approved by everyone.
అందరూ ఈ ఉపాయాన్ని అంగీకరించారు.

ततः तैः चिन्तितं यत् 'अस्माकं ग्रामे शोभायात्रार्थम् अश्वः एव नास्ति, इदानीं किं कुर्मः 'इति।
Then, it was thought over by them- ‘There is no horse at all, in our village for the procession. What shall we do?’
అక్కడ నండి వారిచే చింతించబడినది ఏమిటంటే 'మన గ్రామంలో ఊరేగింపు కోసం గుఱ్ఱమే లేదు, ఇప్పుడు ఏం చేద్దాం',అని.

तदा केचिदुक्तवन्तः- मा चिन्तयन्तु भवन्तः, अश्वाभावे का हानिः, गर्दभमेव अश्वसदृशम् अलङ्कुर्मःइति।
Then some people said- “Please do not worry. What harm is there if horse is not existent? We shall decorate a donkey only as a horse.
అప్పుడు కొందరు అన్నారు- “చింతించ వద్దు మీరు. గుఱ్ఱం లేకపోతే ఏం హాని? గాడిదనే గుఱ్ఱం లాగా అలంకరిద్దాం.” అని.

अन्ते ते तथैव कृतवन्तः । ततः यात्रा आरब्धा ।
In the end, they did it so. Then, the procession started.
చివరికి వాళ్ళు అలాగే చేశారు. అక్కడి నుండి ఊరేగింపు ఆరంభమైంది.

शोभायात्रा बहु भव्यतया प्रचलन्ती आसीत् ।
The procession was proceeding very beautifully.
ఊరేగింపు చాలా భవ్యంగా సాగిపోయింది.

जनाः केचित् देवी जयतु जयतु इति जयघोषं कुर्वन्तः,
Some people were shouting hail, ‘May the Goddess be victorious’,
జనం కొందరు దేవీ జయతు జయతు అని జయఘోషను చేస్తూ

अपरे नामसङ्कीर्तनादिकं कुर्वन्तः,
..yet others were singing devotional compositions,
వేరే కొందరు నామ సంకీర్తనాదులు చేస్తూ,

अन्ये केचन स्फोटकान् विस्फोटयन्, काचन स्त्रियः नृत्यन्त्यः आसन् ।
..some others were cracking explosives, and some women were dancing.
అన్యులు కొందరు టపాసులు పేలస్తూ, కొందరు స్త్రీలు నర్తిస్తూ ఉన్నారు.

एतादृशवैभवं दृष्ट्वा गर्दभः चिन्तितवान् -
The donkey saw all this and thought thus-
ఈ మాదిరి వైభవాన్ని చూసి గాడిద అనుకున్నది-

अहो मम रूपम्, अहो मम सत्त्वम्, अहो मम बलम् इत्यादि।
“Great is my form, great is my existence, great is my strength” etc.
'ఆహా నా రూపం, ఆహా నా సత్త్వం, ఆహా నా బలం' వగైరా.

अचिरात् सः गर्दभः मदेन एवं रीत्या अपि चिन्तितवान्-
No sooner, the donkey (intoxicated) by pride, thought thus as well-
అచిర కాలంలో ఆ గాడిద మదంతో ఈ రీతిగా కూడా ఆలోచించింది.

मम पृष्ठवंशे देव्याः मूर्तिः निविष्टा, तन्मूर्तेः कृते कुतः सर्वैः गौरवं प्रदर्श्यते? भारवाहकः अहमस्मि, मां त्यक्त्वा किमर्थम् एवं कुर्वन्त्येते’- इति विचार्य पृष्ठदेशं कम्पयित्वा मूर्तिं पातितवान् ।
‘The deity’s idol is put on my back, why is everyone showing respect for that idol? I am the load-bearer, leaving me why do people do thus?’- thinking so he shook his back and fell the idol off.
'నా వీపుపై దేవీమూర్తి ఉంది, ఆ మూర్తి కొరకే అందరిచేత గౌరవం ప్రదర్శించబడుతుంది? బరువు మోసేదాన్ని నేనై ఉంటే, నన్ను విడిచి ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు' అని ఆలోచించి వీపును కదిలించి విగ్రహాన్ని పడేసింది.

यावत्पर्यन्तं मूर्तिः तस्योपरि निविष्टा तावत्पर्यन्तं गर्दभाय अतीव गौरवमपि जनाः दत्तवन्तः ।
Until the idol was put on his back, people gave lot of respect to the donkey also.
ఎప్పటివరకు విగ్రహం దాని మీద ఉన్నదో అప్పటి వరకు గాడిద కొరకు చాలా గౌరవాన్ని కూడా జనం ఇచ్చారు.

यदा मूर्तेः पतनम् अभूत् तदा क्रुद्धाः सर्वे गर्दभं यथाकामं दण्डयित्वा ग्रामात् बहिः प्रेषितवन्तः ।
When the idol was fallen, then everyone was angry with the donkey, punished him and sent him away from the village.
ఎప్పుడు విగ్రహం యొక్క పతనం జరిగిందో అప్పుడు కుపితులైన అందరూ గాడిదను ఇష్టం వచ్చినట్లు దండించి గ్రామం నుండి బయటికి పంపేశారు.

एतेन गर्दभः बहुदुःखितः अभूत् ।
The donkey was very sad by this.
దీని వల్ల గాడిద చాలా బాధ పడింది.

अस्याः कथायाः नीतिः का इत्युक्ते -
ఈ యొక్క కథ యొక్క నీతి ఏమిటంటే-
मानवानाम् अपि एषा एव कथा अनुमन्यते।
మానవులకు కూడా ఈ కథ వర్తిస్తుంది.
यदा वयं ज्ञानं , सद्गुणादिकं अर्जयामः तदा सर्वेषां आदरं प्राप्नुमः ।
ఎప్పుడు మనం జ్ఞానం,సద్గుణాదులు సంపాదిస్తామో అప్పుడు అందరి యొక్క ఆదరం పొందుతాం.
यदा ज्ञानहीनाः , गुणहीनाः भवेम तदा गर्दभसदृशम् अनादरं प्राप्नुमः ।
ఎప్పుడు జ్ఞాన హీనులమూ,గుణ హీనులమూ అవుతామో అప్పుడు గాడిద లాగే అనాదరం పొందుతాం.
अतः सर्वदा ज्ञानार्जनं कार्यम्।
అందుచేత ఎప్పుడూ జ్ఞానార్జనం చేయాలి.
ఈ కథ యొక్క నీతి ఏమిటంటే-
गीतायां 'ज्ञानवान्मां प्रपद्यते ' 'ज्ञानी त्वात्मैव मे मतः ' इति साक्षात् भगवानेव ज्ञानस्य महत्वं प्रकटितवान् ।
గీతలో 'జ్ఞానవంతులు నన్ను పొందుతారు'
'జ్ఞాని నేనే అని నా మతము', (జ్ఞానీ నేనూ ఒకటే)అని సాక్షాత్తు భగవంతుడే జ్ఞానము యొక్క మహత్త్వాన్ని ప్రకటించాడు.

संस्कृतम्- श्रीनिधिः अभयङ्करः 
English - Usha Rani Sanka
తెలుగు సేత - పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు