सुरवाणी-कथावनी-1. धनस्य गौरवम्
1. एकदा कुबेरः यज्ञं कर्तुम् इष्टवान्।
Once Kubera wanted to do a yajna.
ఒకప్పుడు కుబేరుడు యజ్ఞం చేయాలని కోరుకున్నాడు.
2. यज्ञे सर्वे जनाः- गन्धर्वाः, देवाः च आगच्छेयुः, अतः सः सर्वेभ्यः निमन्त्रणं दत्तवान्।
All the people- gandharvas, devas, etc. should come to the
yajna, so he sent invitation to everyone.
యజ్ఞానికి సర్వులూ- గంధర్వులు, దేవతలున్నూ రావాలి అని వాళ్ళందరికీ ఆహ్వానాన్ని పంపించాడు.
3. अन्ते च सः कैलासं शिवस्य समीपं गत्वा शिवाय अपि
निमन्त्रणं दत्तवान्।
In the end, he went to Kailāsa near Śiva and gave invitation
to him also.
చివర్న ఆయన కైలాసానికి శివుని చెంతకు వెళ్ళి, శివునికి కూడ ఆహ్వానం అందించాడు.
4. भगवान् शिवः ध्यानमग्नः आसीत्।
Bhagavān Śiva was immersed in dhyāna.
శివ భగవానుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు.
5. भगवान् शिवः उक्तवान्- “अहं गन्तुं न शक्नोमि। पार्वतीं पृच्छतु सा गच्छेत्!”
Bhagavān Śiva said- “I am unable to come. Ask Pārvatī, she might
come.”
శివుడు ,"నేను రాలేను.పార్వతిని
అడుగు. ఆమె రావచ్చు."అన్నాడు.
6. तदा कुबेरः पार्वतीं पृष्टवान्।
Then Kubera asked Pārvatī.
అప్పుడు కుబేరుడు పార్వతిని అడిగాడు.
7. देवी पार्वती अपि नाङ्ग्यकरोत्।
Devī Pārvatī also did not agree.
పార్వతీదేవి కూడా అంగీకరించలేదు.
8. देवी पार्वती उक्तवती- “भगवान् शिवः न गच्छति
चेत् अहमपि न गच्छामि।
Devī Pārvatī said- “If Bhagavān Śiva does not go, I also
would not go.
పార్వతీదేవి,
"శివభగవానుడు
రాకపోతే నేను కూడా రాలేను.
9. भवान् मम पुत्रं गणेशं नयतु। सः गच्छेत्” इति।
You can take my son Gaṇeśa. He might go.”
నీవు నా కుమారుడైన గణేశుణ్ణి తీసుకొని వెళ్ళు. తను వస్తాడు."
అని చెప్పింది.
10. तदा कुबेरः गणेशं प्रार्थितवान्।
Then Kubera prayed Gaṇeśa.
అప్పుడు కుబేరుడు గణేశుణ్ణి ప్రార్థించాడు.
11. गणेशः अङ्गीकृतवान्, “अस्तु। अहं गच्छामि।” इति।
Gaṇeśa accepted, “Alright. I will go.”
గణేశుడు, "సరే, నేను వెళతాను." అని అంగీకరించాడు.
12. तत्क्षणम् एव गणेशः कुबेरस्य गृहं गतवान्।
Immediately Gaṇeśa went to Kubera’s house.
తక్షణమే గణేశుడు కుబేరుడి గృహానికి వెళ్ళాడు.
13. तदानीं यज्ञस्य आयोजनं न अभवत्।
The arrangements for yajna were not yet done.
అప్పటికి యజ్ఞసన్నాహాలు కాలేదు.
14. निमन्त्रितः कोऽपि जनः न आगतवान् आसीत्।
Not even one who was invited came.
ఆహ్వానించిన వారు ఒక్కరూ ఇంకా రాలేదు.
15. परन्तु, गणेशः तत्र गत्वा
कुबेरम् उक्तवान्- “अहं बुभुक्षितः अस्मि। मह्यं भोजनं ददातु।” इति।
But Gaṇeśa went there and said to Kubera- “I am hungry. Please give me food.”
కానీ గణేశుడు అక్కడికి వెళ్ళి కుబేరుడితో, "నాకు ఆకలిగా ఉంది, భోజనమివ్వు (పెట్టు)." అని అడిగాడు.
16. तदा कुबेरः विनम्रनिवेदनं कृत्वा, “सर्वे आगच्छन्तु। किञ्चित् कालानन्तरं भवतः भोजनं कारयिष्यामि” इति उक्तवान्।
Then Kubera humbly requested, “Let everyone come. I shall
make you get bhojanam.”
అప్పుడు కుబేరుడు, "అందరినీ రానివ్వు. కొంచెం సేపటి తరువాత నీకు భోజనం ఏర్పాటు చేస్తాన"ని
అన్నాడు.
17. तदा गणेशः कुपितः अभवत्।
Then Gaṇeśa was angry.
అప్పుడు గణేశుడు కుపితుడైనాడు.
18. “इदानीमेव मह्यं भोजनं ददातु। अन्यथा अहम् इतः गच्छामि।” इति उक्तवान्।
Please give me food right now. Otherwise I will
go away from here.”
ఇప్పుడే నాకు భోజనం ఇవ్వు (పెట్టు), లేకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను." అన్నాడు.
19. कुबेरस्य उपायः नासीत्।
Kubera had no idea (what to do).
కుబేరుడికి వేరే ఉపాయం తోచలేదు.
20. तदा तस्मै गणेशाय भोजनम् आनीय दत्तवान्!
Then he brought food for Gaṇeśa and gave him.
గణేశుడికి భోజనం తెప్పించి పెట్టాడు.
21. गणेशः भोजनं प्राप्य शीघ्रं शीघ्रं खादितवान्।
Gaṇeśa obtained bhojanam and ate fast.
భోజనాన్ని పొంది, గణేశుడు
త్వరత్వరగా తినేశాడు.
22. “पुनः भोजनम् आनयतु” इति आदिष्टवान्।
“Bring food again” he ordered.
మళ్ళీ ఇంకా భోజనం తెప్పించమని ఆదేశించాడు.
23. कुबेरः तस्मै पुनः भोजनं दत्तवान्।
Kubera gave him bhojanam again.
కుబేరుడు ఆయన కోసం మళ్ళీ భోజనం తెప్పించి పెట్టాడు.
24. एवं कृत्वा कुबेरस्य गृहे यद् भोजनं निर्मितम्
आसीत् तत् सर्वं गणेशः खादितवान्।
Having done so, whatever food was prepared in Kubera’s
house, Gaṇeśa
ate all that.
అలా కుబేరుడి ఇంట్లో వండిన భోజనాన్నంతా గణేశుడు తినేశాడు.
25. “इतोऽपि मम क्षुधा शान्ता न अभवत्, भोजनम् आनयतु।” इति पुनः आदिष्टवान्
गणेशः।
Still my hunger is not pacified. Please bring
food.” he ordered again.
"ఇంకా నా ఆకలి తీరలేదు.
భోజనం తెప్పించు." అని ఆదేశించాడు గణేశుడు.
26. सर्वं भोजनं समाप्तम् आसीत्।
All the food was finished.
భోజనమంతా అయిపోయింది.
27. कुबेरः तदा गणेशस्य पुरतः क्षमां प्रार्थितवान्।
Kubera sought forgival of Gaṇeśa.
కుబేరుడు అప్పుడు గణేశుణ్ణి క్షమించమని ప్రార్థించాడు.
28. परन्तु गणेशः- “इदानीम् अहं त्वां खादिष्यामि।”
इति उक्तवान्।
But Gaṇeśa said- Now I shall eat you.”
కానీ గణేశుడు కుబేరుడితో, "ఇప్పుడు నేను నిన్నే తింటాను." అన్నాడు.
29. कुबेरः तदा भयेन कैलासं प्रति धावितवान् ।
Kubera then ran to Kailāsa.
కుబేరుడు భయంతో కైలాసానికి పరుగెత్తాడు.
30. तस्य पृष्ठतः गणेशः अपि तां ग्रहीतुं धावितवान्
।
Gaṇeśa ran behind him to catch him.
అతని వెనుక గణేశుడు అతణ్ణి పట్టుకోవటానికి పరుగెత్తాడు.
31. भगवतः शिवस्य पुरतः शिवं नमस्कृत्य,
“हे भगवन्! मां रक्षतु! भवतः पुत्रः मां खादिष्यति , तस्मात् रक्षतु भगवन्!” इति।
Kubera went to Shiva, saluted him and said- “O God, Protect
me. Your son will eat me. Please protect me from him.”
కుబేరుడు శివభగవానుడి ముందు నిలిచి నమస్కరించి, "భగవాన్! నన్ను రక్షించు. నీ కుమారుడు నన్ను
తినబోతున్నాడు. ఆయన నుండి నన్ను రక్షించు." అని ప్రార్థించాడు.
32. तदा पार्वती मृदु हसित्वा उक्तवती- “हे कुबेर!
चिन्ता न कार्या!”
Then Pārvatī smiled softly and said- “O Kubera, please do
not worry.”
అప్పుడు పార్వతీదేవి మందహాసం చేస్తూ, "ఓ కుబేరా! చింతించవద్దు."
33. माता पार्वती तदा गणेशाय भोजनं दत्त्वा तस्य
क्षुधां शान्तां कृतवती।
Pārvatī gave food to Pārvatī and made his hunger pacified.
అని భోజనం పెట్టి గణేశుడికి ఆకలిని శాంతింపజేసింది.
34. कुबेरस्य अहङ्कारः आसीत् यत् त्रिलोके स्थितेभ्यः
सर्वेभ्यः अहं भोजनं दास्यामि इति।
Kuberas’ arrogance was that he could provide food to all the
people in all the three worlds.
'మూడు లోకాలలో ఉన్న అందరికీ
భోజనం పెట్టగలను' అన్న కుబేరుడికి అహంకారం
ఉండేది.
35. कुबेरस्य अहङ्कारः तदा एव अपगतः अभवत्।
Thus then Kubera’s arrogance was removed.
అప్పుడు కుబేరుడి అహంకారం నశించింది.
संस्कृतम् -प्रदीपनाथः
English- Usha Rani Sanka
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి