सुरवाणी-कथावनी-2. किरीटस्य अहङ्कारः अपगतः

1. एकदा बहिः गतः श्रीमन्नारायणः वैकुण्ठम् आगतवान्। स्वभवनं प्रविष्टवान्।
Once Śrīmannārāyaṇa went out and returned to Vaikuṇṭha. He entered his palace.
ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు విహారానికి వెళ్ళి వైకుంఠానికి తిరిగి వచ్చాడు. తన భవనంలోకి ప్రవేశించాడు.

2. तत्र शयनप्रकोष्ठे पादुके विसृज्य सः शेषशयने शयनं कृतवान्। निद्रामग्नः च अभवत्।
There in the sleep-chamber, he removed his foot wear and slept upon śeṣa-couch.
శయన మందిరంలో పాదుకలను విడిచి, శేషశయనం మీద పవ్వళించాడు. నిద్రించాడు.

3. तदा तत्र स्थितः श्रीमन्नारायणस्य किरीटः पादुके उद्दिश्य अवदत्-
Then Śrīmannārāyaṇa’s crown sitting there, said to the footwear.
అప్పుడు అక్కడ ఉన్న శ్రీమన్నారాయణుడి కిరీటం పాదుకలను ఉద్దేశించి ఇలా అన్నది-

4. “हे पादुके। भवत्योः परिज्ञानम् अस्ति किम्?
“O footwear! Do you have any sense at all?
"పాదుకలారా! మీకు ఏమైనా జ్ఞానం ఉన్నదా?

5. सर्वेषु अशुचिस्थानेषु अटित्वा प्रकोष्ठस्य अन्यः आगमनम् उचितं वा, इतः निरगम्यताम्।” इति।
Having wandered in all (kinds of) untidy places, is it proper to come inside? Get out from here.”
ఎక్కడెక్కడో  అశుచిగా ఉండే ప్రదేశాలలో తిరిగి (వచ్చి), ఇక్కడ ఉండటం ఉచితమా! వెళ్ళండి ఇక్కడ నుండి."

6. तदा पादुकाभ्याम् उक्तम्- “आवां स्वयम् अत्र न आगते।
Then the footwear said- “We did not come on our own.
అప్పుడు పాదుకలు, "మేము స్వయంగా ఇక్కడికి రాలేదు.

7. श्रीमन्नारायणेन एव अत्र आनीते। भवतः किमर्थं क्रोधः?” इति।
We are brought by Śrīmannārāyaṇa himself. Why are you angry?
శ్రీమన్నారాయణుని చేత ఇక్కడకు రప్పించబడ్డాము." అన్నాయి.

8. तदा किरीटस्य क्रोधः इतोऽपि अधिकः जातः।
Then the anger of the crown grew even more.
అప్పుడు కిరీటానికి చాలా కోపమొచ్చింది.

9. तदा, नारायणस्य पादमूले स्थिताभ्यां भवद्भ्यां भगवतः शिरसि स्थितस्य किरीटस्य मम प्रतिवचनं दीयते वा?
Then, “You who stay at the feet of Nārāyaṇa arguing with the crown, who is placed on the head of Bhagavān!?”
"భగవంతుడి పాదాల కింద ఉండే మీరు ఆయన శిరస్సు మీద ఉండే కిరీటాన్ని అయిన నాకు ఎదురు సమాధానం చెప్తారా!?

10. कियद् साहसं भवत्योः!” इति अगर्जत् किरीटः।
How dare you!” thus shouted the crown.
ఎంత సాహసం మీకు!" అని గర్జించింది.

11. तदा पादुकाभ्याम् उक्तं- “हे शिरभूषण! यद्यपि भगवतः पादमूले आवां भवावः तथापि चरणसेवकानां जीवनम् एव धन्यम् इति सर्वैः विदितम् एव।” इति।
Then, the footwear said, “O ornament of the head! Though we are below the foot of bhagavān, yet the life of those who serve the feet is alone blessed, is known by everyone!”
అప్పుడు పాదుకలు- "ఓ శిరో భూషణమా! మేము భగవంతుడి పాదాల కింద ఉన్నా, పాదసేవకుల జీవితం ధన్యం అని అందరికీ తెలుసు." అన్నాయి.

12. तयोः सम्भाषणं श्रुत्वा शङ्क-चक्र- गदादयः पादुके निन्दन्तः किरीटस्य समर्थनं कृतवन्तः।
Having heard their conversation, the śaṇkha, chakra, gadā etc. supported the crown who was reproaching the footwear.
వారి సంభాషణను వింటున్న శంఖ చక్ర గదాదులు పాదుకలను నిందిస్తూన్నవై, కిరీటాన్ని సమర్థించినాయి.

13. तदा पादुके दुःखिते जाते।
Then the footwear became very sad.
అప్పుడు పాదుకలకు దుఃఖం కలిగింది.

14. ताभ्यां द्वाभ्यां अपि भगवतः नारायणस्य प्रार्थना कृता।
Bhagavān Nārāyaṇa’s prayer was done by them both.
పాదుకలు రెండింటి చేతా భగవంతుడైన నారాయణుడు ప్రార్థించబడినాడు. (పాదుకలు రెండూ భగవంతుడిని ప్రార్థించినవి.)

15. “हे भगवन्, भवता एव आवाम् अत्र आनीते इदानीम् ईदृशं निन्दनवचनम् उचितं वा?” इति।
“O Bhagavan, we are brought here by you! Now, is this reproach proper?”
"ఓ భగవంతుడా! మేము నీచేతనే ఇక్కడకు తీసుకుని రాబడినాము. ఇలా నిందింపబడటం ఉచితమా?"

16. तदा भगवान् नारायणः पादुके दृष्ट्वा दीर्घं निःश्वस्य किरीटम् उद्दिश्य एवम् अवदत्-
Then, Bhagavān Nārāyaṇa saw the footwear, took a deep breath and said looking at the crown-
అప్పుడు భగవంతుడైన నారాయణడు పాదుకలను చూసి దీర్ఘంగా నిశ్వసించి, కిరీటాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు-

17. “हे किरीट! भवान् मम प्रियपादुकयोः एवम् उपहासं कृतवान्।
“O crown, you have ridiculed my favorite footwear thus.
"ఓ కిరీటమా! నువ్వు నా ప్రియమైన పాదుకలను అపహాస్యం చేశావు.

18. अतः रामावतारकाले चतुर्दशवर्षाणि यावत् भवान् पादुकयोः उपरि एव तिष्ठतु।
Hence, in the time of Rāma’s incarnation, you stay on the footwear only for whole fourteen years.
కాబట్టి నా రామావతార కాలంలో పదునాలుగు సంవత్సరాలు నువ్వు  పాదుకల పైనే ఉంటావు.

19. तदा शङ्कचक्राभ्याम् अपि भरत-शत्रुघ्नरूपेण चतुर्दशवर्षाणि यावत् तयोः सेवा करणीया इति।
Then, the Śaṇkha, Chakra also shall become Bharata and Śatrughna and serve them for fourteen years.
అప్పుడు శంఖచక్రాలు కూడా భరత శత్రుఘ్నులుగా పదునాలుగు సంవత్సరాలు పాదుకలను సేవించాలి."

20. तदनुसारम् एव त्रेतायुगे भरतः रामस्य पादुके सिंहासने स्थापितवान्।
Following that only, in Tretā yuga, Bharata had put Rāma’s footwear on the throne.
ఆ ప్రకారంగానే త్రేతాయుగంలో భరతుడు రామ పాదుకలను సింహాసనంపై ఉంచాడు.

21. चतुर्दशवर्षाणि यावत् शत्रुघ्नेन सह तयोः सेवां कृतवान्।
For fourteen years he served them along with Śatrughna.
పదునాలుగేళ్ళపాటు శత్రుఘ్నుడితో కలిసి వాటిని సేవించాడు.

22. तदा एव भगवतः नारायणस्य किरीटस्य अहङ्कारः अपगतः अभवत् ॥
Then only the ego of the crown of Bhagavān Nārāyaṇa had gone away.
అప్పుటికి భగవంతుడైన నారాయణుడి కిరీటానికి అహంకారం తొలగిపోయింది.


संस्कृतम् -प्रदीपनाथः
English- Usha Rani Sanka
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు